HomeTelanganaNizamabadఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ను పురస్కరించుకొని నవీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు.

ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులకు యోగా విశిష్టతను, దైనంది న జీవితంలో యోగ ప్రాముఖ్యతను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగామణి విద్యార్థులకు వివరించి నిత్యం పాటించాల్సిందిగా సూచించారు.

ఉదయం చేయాల్సిన శ్వాసక్రియ కసరత్తు మరియు విద్యార్థులకు ఉపయుక్తమైన ఆసనాలను పాఠశాల వ్యాయామ అధ్యాపకులు Dr. రవీందర్ అబ్బ పూర్ విద్యార్థులతో చేయించి వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.


అనంతరం సాయంత్రం పాఠశాల విద్యార్థులతో యోగ ఆంగ్ల అక్షరాలతో వివిధ ఆసనాలతో నిర్వహించిన కసరతులు అందర్నీ ఆకట్టుకున్నాయి.


ఈ కార్యక్రమంలో హెచ్ఎం, పీడి తో పాటు ఉపాధ్యాయులు భూమయ్య, లక్ష్మణ్, జ్ఞానేశ్వర్, రవీంద్ర కుమార్, మహమ్మద్ వాయిద్, సుధాకర్ రెడ్డి, విశ్వనాథ్, శ్రీకాంత్, రఘుపతి, సతీష్, సురేఖ, సుభాషిని, రాధా, భారతి, పాఠశాల సిబ్బంది హేమలత , లక్ష్మీ నర్సు బాయ్ , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments