HomeCRIMEఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంపై ఏసీబీ దాడులు..

ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంపై ఏసీబీ దాడులు..

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న ప్రభుత్వ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు మంగళవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు.

మల్లారెడ్డికి సంబంధించి నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్, స్వగ్రామం అయినా నల్గొండ, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున కీలకమైన పత్రాలు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఉదయం నుంచి కొనసాగిన సోదాల అనంతరం, మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. సోదాలు పూర్తిస్థాయిలో ముగిసిన తర్వాత, ఆస్తుల విలువ మరియు ఇతర వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

జిల్లాలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ చేసినా లావాదేవీలను రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ద్వారా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కానీ సదరు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో acb అధికారులు తనిఖీలు చేస్తే మల్లారెడ్డి కి చెందిన తతాంగం బట్టబయలు అవుతుందని ఎక్సైజ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

గతంలో జిల్లాలోని ఓ డివిజన్ కు చెందిన కళ్లు ముస్తేదారు ఏడాది క్రితం కళ్లు డిపో విషయం లో తలెత్తిన వివాదం లో సదరు కళ్లు ముస్తేదారు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments