HomeCRIMEపాయిజన్ ఇంజక్షన్ తీసుకోని డాక్టర్ ఆత్మహత్య .......ఆసుపత్రి యాజమాన్య వేధింపులే ?

పాయిజన్ ఇంజక్షన్ తీసుకోని డాక్టర్ ఆత్మహత్య …….ఆసుపత్రి యాజమాన్య వేధింపులే ?

.పాయిజన్ తీసుకోని ఓ డాక్టర్ ఆత్మ హత్య కు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ రికవరీ హాస్పిటల్లో జరిగింది ‌ డాక్టర్‌ ఆత్మహత్య. పాయిజన్‌ ఇంజక్షన్‌ తీసుకొని డాక్టర్‌ ఆత్మహత్యకు ఆస్పత్రి యాజమాన్యం వేధింపులే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి .

రికవరీ హాస్పిటల్‌లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (DMO)గా పనిచేస్తున్న డాక్టర్ ఖాసిం.. హాస్పిటల్ యాజమాన్యం వేధింపులు, మితిమీరిన పని ఒత్తిడి తట్టుకోలే మనస్తాపానికి గురైన ఆయన.. ఆసుపత్రిలోని రూమ్ నెంబర్ 201లోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు.

అనంతరం తన చేతికి తానే పాయిజన్ (మత్తు) ఇంజక్షన్ ఇచ్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.. డాక్టర్ ఖాసిం ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బయటకు పొక్కకుండా.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

యాజమాన్యం చేసిన వేధింపుల వల్లే డాక్టర్ ఖాసిం ప్రాణాలు కోల్పోయాడని.. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

డాక్టర్ ఖాసీం మృతి ఫై బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆసుపత్రి లో డాక్టర్ గది లో పాయిజన్ ఇంజక్షన్ ను స్వాధీనం చేసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments