HomeCRIMEబాసర అమ్మవారి గుడిలో భారీ చోరీ

బాసర అమ్మవారి గుడిలో భారీ చోరీ

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. అంతరాలయప్రాంగణంలో ఉండే మహాకాళి అమ్మవారి గుడిలోని ఈ ఘటన జరిగింది.ఆలయ తలుపులలకు ఉండే తాళం ధ్వసం చేసి అమ్మవారి వెండి కిరీటం, భారీ హుండీని దొంగలు అపహరించారు.

అంతే కాకుండా వ్యాస గుహ వద్ద హుండీని పగలగొట్టి నగదును తీసుకుని ఖాళీ హుండీని అక్కడే కొద్దీ దూరంలో వదిలి వెళ్ళిపోయారు.

మంగళవారం ఆలయం ప్రధాన హుండీ ని తెరవడానికి యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లై చేసింది ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి సమయంలో ముసుగులు ధరించిన ఇద్దరు ఆలయంలో ఎంట్రీ కావడానికి ముందే అక్కడున్న సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత పడ్డారు ఆ కెమెరాలకు గుడ్డలు చుట్టేశారు .

ఆలయంలో ఆరుగురు హోమ్ గార్డులు వీధి నిర్వహణలో ఉన్నా చోరీ జరగడం ఫై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో ఫుటేజీ ని చూస్తున్నారు ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ షర్మిల, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిశీలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments