HomeTelanganaNizamabadయూరియా యాప్ బిఆర్ యస్ తాడ్వాయి ఆందోళన ఫై ఆంక్షలు ....ముందస్తు ...హౌస్ అరెస్ట్...

యూరియా యాప్ బిఆర్ యస్ తాడ్వాయి ఆందోళన ఫై ఆంక్షలు ….ముందస్తు …హౌస్ అరెస్ట్ లు ….

యూరియా యాప్‌తో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బిఆర్ యస్ ఆందోళనలను మరింత ఉదృతం చేస్తోంది. ఆయా నియోజకవరాల్లో రైతుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆ పార్టీ ఈ అంశం మరింత ఫోకస్ పెట్టింది.

ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులకు యూరియా కష్టాలు మల్లీ మొదలు అయ్యాయి ఈ నేపథ్యంలో బిఆర్ యస్ పార్టీ యాప్ తొలగించాలని ఆందోళనకు దిగడం ఆసక్తిగా మారింది మొదటజిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో ఎదో మొక్కుబడిగానే ధర్నాలు చేసిన రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

వేల్పూర్ క్రాస్ రోడ్ లోని జాతీయ రహదారి మీద మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ యస్ శ్రేణులు భారీగా మోహరించడం తో యంత్రాంగం ఉక్కిరి బిక్కిరి అయ్యింది. మరో వైపు క్యాడర్ కు సైతం మంచి బూస్టప్ అయింది.

దీనితో యాప్ ఆందోళన మరింత ఉదృతంగా కొనసాగించాలనే కార్యాచరణ కు ఆ పార్టీ సిద్ధం అయింది. ఇందులో భాగంగా నే మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లో భారీ ధర్నా కు సిద్ధం అయింది మొన్నటి దాక ఈ ఆందోళనలను లైట్ తీసుకున్న పోలీసులు ఎల్లారెడ్డి ధర్నా కు అనుమతి నిరాకరించింది.

అంతటి తో ఆగకుండా ఆంక్షల అస్రం ను తెరమీదికి తెచ్చింది. అర్ద రాత్రి నుంచి తెల్లవారు జామున దాక ముందస్తు అరెస్టు లతో బెంబేలెత్తించింది, క్రియాశీలకంగా ఉండే నేతలను కార్యకర్తలను తాడ్వాయి నుంచి దోమకొండ సదాశివనగర్ గాంధారి పోలీస్ స్టేషన్‌ల కు తరలించారుముఖ్య నేతలెవ్వరూ రాకుండా ఎక్కడిక్కడే కట్టడి చేసారు .

ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో రైతుల పక్షాన పోరాడే గొంతుకలను నొక్కలేదనిబిఆర్ యస్ నేతలు హెచ్చరించారు… ప్రస్తుతం రైతులు యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దానికి నిరసనగా తాడ్వాయి మండల కేంద్రంలో శాంతియుత ధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రైతుల యూరియా సమస్యలు పూర్తిగా తొలగిపోయేంత వరకు బీఆర్‌ఎస్ పార్టీ తరపున పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.

/// వేముల ప హౌస్ అరెస్ట్///

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయ్ మండలంలో యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ఇన్‌చార్జి జాజాల సురేందర్ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా పోలీసులతో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎట్టి పరిస్థితి లో ఎల్లారెడ్డి వెళ్తానని వాగ్వాదానికి దిగారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments