విలువైన భూమలకు సంబంధించి నకిలీ పత్రాల తయారు చేసి న్యాయ పరమైన వివాదం వచ్చేలా చేస్తూ అక్రమ వసూళ్లలకు పాల్పడుతున్న ఓముఠా ను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు దశాబ్దకాలంగా భూములపై వివాదాలు సృష్టిస్తూ కోట్ల రూపాయల విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ (61)ను బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, న్యూ మలక్‌పేట్‌కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్ నజముద్దీన్ షాకీర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ వారసత్వంగా వచ్చిన భూమిలో 2025లో నిర్మాణ పనులు ప్రారంభించిన సమయంలో ఖుద్దూస్ ఆ స్థలంపై హక్కులు ఉన్నాయని పేర్కొంటూ నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి.
దర్యాప్తులో ఫోర్జరీ చేసిన స్టాంప్ పేపర్లు, నకిలీ హిబానామా పత్రాలను ఉపయోగించి కోర్టుల్లో సివిల్ కేసులు, రిట్ పిటిషన్లు దాఖలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసలు యజమానులను కోర్టుల చుట్టూ తిప్పుతూ మానసిక ఒత్తిడికి గురిచేయడం అతని ప్రధాన వ్యూహంగా వెల్లడైంది.
అంతేకాకుండా, తన అనుచరుల ద్వారా ఫిర్యాదుదారుని సంప్రదించి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు, డబ్బులు చెల్లించకపోతే తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తామని, హత్య కేసుల్లో నిందితులుగా చూపిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో ఫోర్జరీ చేసిన స్టాంప్ పేపర్లు, నకిలీ హిబానామా పత్రాలను ఉపయోగించి కోర్టుల్లో సివిల్ కేసులు, రిట్ పిటిషన్లు దాఖలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అసలు యజమానులను కోర్టుల చుట్టూ తిప్పుతూ మానసిక ఒత్తిడికి గురిచేయడం అతని ప్రధాన వ్యూహంగా వెల్లడైంది. అంతేకాకుండా, తన అనుచరుల ద్వారా ఫిర్యాదుదారుని సంప్రదించి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు, డబ్బులు చెల్లించకపోతే తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తామని, హత్య కేసుల్లో నిందితులుగా చూపిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
