ముగ్గురు మైనర్ బాలికలు మిస్సింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా ఛేదించారు జస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న చిన్న మెసేజ్ ఆధారంగా రైల్ లో వెళ్తున్న ముగ్గురు బాలికలఆచూకీ గుర్తించారు వారిని తల్లి చెంతకు చేర్చారు. హైదారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధి లోని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధి లోని ఓ తల్లి ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతున్న ముగ్గురు పిల్లను .మందలించింది ఫోన్‌ను తీసుకుంది .
దీంతో మనస్తాపానికి గురైన బాలికలు ఇంట్లో నుంచి రూ.3 వేల నగదు తీసుకుని ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు బాలికలు ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించారు.
కానీ ఫోన్ తల్లి తీసుకోవడంతో వారి లొకేషన్ ట్రేస్ చెయ్యడం కుదరలేదు కానీ వీడియో గేమ్స్ ఆడే సమయంలో వారికి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువకుడు పరిచయమైనట్లు గుర్తించారు. అతనితో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేస్తున్నట్లు తేలింది.. ఈ క్రమంలో ఆ యువకుడి ఇన్స్టాగ్రామ్ ఖాతా, అతని స్నేహితుల ఖాతాలను కూడా పోలీసులు పరిశీలించారు.
ఈ సమయంలో ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి యువకుడి స్నేహితుడికి “బెంగాల్‌కు వస్తున్నాం” అంటూ మెసేజ్ వెళ్లినట్లు గుర్తించారు.
ఆ మెసేజ్ ఆధారంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేయగా, బాలికలు ఏలూరు మీదుగా వెళ్తున్న రైలులో ఉన్నట్లు తేలింది. , రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో ఏలూరులో ముగ్గురు బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకోని హైదారాబాద్ పంపించారు
