యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ వల్ల నిరక్షరాస్యులైన రైతులకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు వద్ద స్మార్ట్‌ఫోన్ లేదని, కొంతమందికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో యాప్ ఆధారిత బుకింగ్ విధానం మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తోందని ఆరోపించారు.
అసైన్మెంట్ భూముల్లో సాగు చేసే రైతులు, చిన్న, సన్నకారు రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు
