లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులు మహారాజుల మురళి 60 మంగళవారం అర్ధ రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మహారాజుల మురళి సంఘ్ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచలంచెలుగా ఎదిగి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా సేవలందించారు.
బాబ్రీ మసీద్ కూల్చివేతలో కరసేవకుడిగా వెళ్ళారు. మురళి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆయన మృతదేహానికి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు, రాష్ట్ర నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ రవీందర్రావు, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, బిజెపి మండలాధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.
