హజ్రత్ పీర్ షహీన్ పాషా ఖాద్రీ సాహబ్ సందల్-ఇ-ముబారక్ మరియు 40వ ఉర్స్-ఇ-షరీఫ్ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం సజ్జాదా నషీన్ సూఫీ షా డాక్టర్ మొహమ్మద్ జహంగీర్ అలీ ఖాద్రీ సాహబ్ పర్యవేక్షణలో నిర్వహించబడింది.
ఈ వేడుకలకు సూఫీ షా మొహమ్మద్ యూసుఫ్ షరీఫ్ ఖాద్రీ సాహబ్ ముఖ్య అతిథిగా (మెహమాన్-ఇ-ఖుసూసి) హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు, మురీదీన్లు, మోతాకిదీన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని, హజ్రత్ పీర్ షహీన్ పాషా ఖాద్రీ సాహబ్ ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సందర్భంగా సజ్జాదా నషీన్ సూఫీ షా డాక్టర్ మొహమ్మద్ జహంగీర్ అలీ ఖాద్రీ సాహబ్ మాట్లాడుతూ, ఉర్స్ వేడుకలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన సూఫీ షా మొహమ్మద్ యూసుఫ్ షరీఫ్ ఖాద్రీ సాహబ్, శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించిన పోలీస్ శాఖ, ప్రతినిధులకు విచ్చేసిన భక్తులకు, మురీదీన్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
