HomeTelanganaNizamabadఓటరు జాబితా సవరణలో పౌరులందరూ భాగస్వాములు కావాలి- బూత్ స్థాయి అధికారుల సర్వేకు సహకరించండి- టీఎన్‌జీవో...

ఓటరు జాబితా సవరణలో పౌరులందరూ భాగస్వాములు కావాలి- బూత్ స్థాయి అధికారుల సర్వేకు సహకరించండి- టీఎన్‌జీవో కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్)

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా, శనివారం బూత్ స్థాయి అధికారులు టీఎన్‌జీవో కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) నివాసాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యుల ఓటర్ వివరాలను ధృవీకరించి, నిర్దేశిత ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు, జాబితాలోని తప్పులను సరిదిద్దేందుకు ఈ సర్వే గొప్ప అవకాశం అని పేర్కొన్నారు.

బాధ్యతాయుతమైన పౌరులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలని, ఇంటింటికీ వచ్చే బీఎల్ఓలకు వాస్తవ సమాచారాన్ని వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36,000 మంది బీఎల్ఓలు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రక్రియలో భాగంగా మొదటి విడతలో భాగంగా బీఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారాలను మాత్రమే అందజేస్తారని, వారం రోజుల తర్వాత తిరిగి వచ్చి పూర్తి చేసిన ఫారాలను సేకరిస్తారని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రాథమిక దశలో ఎలాంటి అధికారిక పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు.జూలై 31: ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన. జూలై 31 – ఆగస్టు 30: తప్పుల సవరణకు మరియు కొత్త ఓట్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణ.అక్టోబర్ 1, 2026. తుది ఓటర్ల జాబితా విడుదల.

ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణల ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments