బంజారా హిల్స్ లోని జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీషీటర్ వీరంగం చేసాడు . మద్యం మత్తులో షోరూమ్‌లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
బంజారాహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌కు అలీమ్, యూనస్ లు వచ్చారు మేనేజర్ పంకజ్ ను బెదిరించారు.
తమ వెంట తెచ్చిన కత్తి బయటికి తీశారు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా తర్వాత వచ్చినప్పుడు డబ్బు రెడీగా ఉంచాలి అంటూ హెచ్చరించారు .
ఈ మేరకు మేనేజర్ పంకజ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు నిందితులు అలీమ్, యూనస్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
