HomeTelanganaNizamabadనిజామాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రొ.కోదండరాం

నిజామాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రొ.కోదండరాం

నిజామాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు ప్రొ.కోదండరాం గారు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా, సమగ్రంగా కొనసాగుతుందని పేర్కొంటూ ఉద్యమంలో వివిధ రూపాల్లో పాల్గొన్న ప్రతి వర్గం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని న్యాయం జరిగేలా కమిటీ పనిచేస్తుందని తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గౌరవం కోసం కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, స్థానిక జిల్లా జేఏసీ నాయకులు, ఉద్యమకారులు, ఉద్యమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments