నవీపేట మండలంలోని సిరన్పల్లి గ్రామ శివార్లలో పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి చేసింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఘటన వివరాల్లోకి వెళ్తే.. సిరన్పల్లి గ్రామ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న చీతా ఫోర్స్ సిబ్బంది, వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు.
పోలీసులను చూడగానే పరారయ్యేందుకు ప్రయత్నించిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి పోలీసులు రూ. 1,26,000 నగదును ఎనిమిది సెల్ఫోన్లు,ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారందరినీ నవీపేట పోలీసులకు అప్పగించగా, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
