ఆర్మూర్ పట్టణం లో ఓ ప్రైవేట్ పాఠశాలలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలి వానల మారింది.బీజేపీ ఛలో ఆర్మూర్ కు పిలుపు నివ్వడం తో సోమవారం హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
పలు హిందూ సంఘాల అద్వర్యం లో ఉదయమే శాంతి ర్యాలీ కి సిద్ధం అయ్యారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఆధ్వర్యంలో భారీఎత్తున బీజేపీ కార్యకర్తలు పెర్కిట్ చౌరస్తా లోని భరత్ చంద్ర పాఠశాల కు వద్ద కు చేరుకొని బైఠాయించారు పెద్దఎత్తున నినాదాలు చేసారు… ముందు జాగ్రత గా పట్టణంలో పలు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
ఆర్మూర్ లో హిందు సంఘాలు తలపెట్టిన శాంతి ర్యాలీ లో పాల్గొనడానికి సోమవారం ఆర్మూర్ కు వస్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని పోలీసులు ఆర్మూర్ రాకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి తన వాహనంలో ఆర్మూర్ వెళ్తున్న ఎమ్మెల్యేను భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ఆర్మూర్ వెళ్లనీయకుండా పోలీసులు వాహనాన్ని నిలిపివేయడంతో, ఎందుకు వాహనాన్ని ఆపుతున్నారంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే ఆర్మూర్ లో పరిస్థితి బాగాలేదని, మీరు అక్కడికి వెళితే ఇంకా గొడవ పెద్దదయ్యే ప్రమాదం ఉన్నందున ఇక్కడే ఆపేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
దీంతో వాహనంలో నుంచి తాను కిందికి దిగలేనని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా స్వల్ప ఉద్రిక్తతకు దారి తీయడంతో సర్కిల్ పరిధిలోని పోలీసులను పెద్ద ఎత్తున టోల్ ప్లాజా వద్ద మోహరించారు.
పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వాహనం నడిరోడ్డు పైన ఆపేసి దాంట్లోనే కూర్చున్నారు. అరెస్టు చేయకుండా స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించకుండా, హైడ్రామా నడుమ పోలీస్ ఎస్కార్ట్ తో భిక్కనూరు సీఐ జగడం నరేష్ ఆధ్వర్యంలోని పోలీసులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయానికి తరలించారు.
అంతకు ముందు ఆర్మూర్ లో భరత్ చంద్ర పాఠశాల ప్రిన్సిపాల్ ఫై చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ యంఐయం సైతం ఆదివారం పెద్దఎత్తున ఆందోళనకు దిగింది ఆ పార్టీ ఎంపీ హాసదొద్దీన్ ఒవైసీ సైతం వాకబు చేసారు.
