నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం దర్శించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, దేవస్థాన అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మహేష్ కుమార్ గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
