నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.పి. శ్రీశైలం: ఈయన నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీగా నియమితులయ్యారు. గతంలో శ్రీశైలం నిజామాబాద్ సీఐగా, ఆ తర్వాత ఎస్బీవిభాగంలో పని చేసిన అనుభవం ఉంది. తనదైన శైలిలో విధులు నిర్వర్తించి, పనితీరుతో గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు పదోన్నతిపై సీసీఎస్ ఏసీపీగా నియమించారు. నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా ఆర్. నరేందర్ నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. అలాగే నిజామాబాద్ సీసీఆర్‌బీ, ఫంక్షనల్ వర్టికల్స్ ఏసీపీగాబి. గురునాయుడు లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పదోన్నతి పొందిన ఏసీపీ శ్రీశైలంతో పాటు, ఇతర అధికారులకు పోలీస్ సిబ్బంది, సహచర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ముగ్గురు ఏసీపీల నియామకం..
RELATED ARTICLES
