HomeCRIMEగురుకులం భవనం నుంచి కింది పడ్డ విద్యార్థిని

గురుకులం భవనం నుంచి కింది పడ్డ విద్యార్థిని

వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల లో ఓ విద్యార్ధి భవనం మీది నుంచి కింద పడిపోయింది.

రెండో అంతస్తు నుంచి ఆదివారం అర్ధరాత్రి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి కింద పడడంతో నడుముతో పాటు రెండు కాళ్లు విరగడంతో విద్యార్థినికి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది.

తక్షణ వైద్యం కోసం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు తాండూరు నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కావాలని కింద దూకిందా… లేదా ఎవరైనా తోసేసారా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఘటనపై విచారణ ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments