నిజామాబాద్ రేంజ్ డీఐజీ పోస్టు ఎట్టకేలకు భర్తీ అయింది ఏళ్ల తరబడిగా ఇంచార్జ్ లతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం . బాసర జోన్-2 డీఐజీగా ఆర్.భాస్కరన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి భాస్కరన్, ఇప్పటివరకు సీఐ సెల్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తూనే, బాసర జోన్ డీఐజీగా అదనపు బాధ్యతలు చూసుకుంటున్నారు.
తాజాగా ఆయనను ఆ పోస్టులో పూర్తిస్థాయి డీఐజీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.గత ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చాక నిజామాబాద్ రేంజ్ ను బాసర జోన్ లో కలిపారు.
డిఐజి ఆఫీస్ ఎక్కడ ఉండలని విషయం లో అప్పటి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వలేదు కానీ మౌలిక సదుపాయాలు అంతగా లేని బాసర లో డిఐజి కార్యాలయం ఏర్పాటు చేయడం ఫై ఉన్నతాధికారులు ఆసక్తి చూపలేదు.
కానీ డిఐజి ఆఫీస్ ఏర్పాటు అయిన మొదట్లో నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లా పరిధి వుండేది.కానీ బాసర జోన్ వచ్చాక నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల్ జిల్లా ను చేర్చారు.కానీ కొత్త జోన్ అందుబాటులోకి వచ్చాక ప్రభుత్వం పూర్తీ స్థాయి డిఐజి ని మాత్రం నియమించలేదు అందుకే ఈ జోన్ పాలన వ్యవస్థ మీద ఇంకా గందోరగోళమే కొనసాగుతుంది.
బాసర జోన్ డిఐజి ఆఫీస్ ఎక్కడ ఉండలని విషయంలోనే ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు బాసర లో కానీ పక్షంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు సైతం పరిశీలన జరిగింది కానీ బాసర జోన్ వచ్చి దాదాపు ఆరేళ్ళు కావొస్తుంది అయినా ఇంకా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే కొనసాగిస్తున్నారు.
పూర్తీ స్థాయి డిఐజి లేక పోవడంతో ఇక్కడ ఆఫీస్ లో ఉండే సిబ్బందికేవలం కాలక్షేపం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం భాస్కరన్ ను డిఐజి నియమించిన నేపథ్యంలో డిఐజి ఆఫీస్ విషయంలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది
