దాదాపు నెల రోజుల పాటు శ్రమించి పట్టుకున్న డ్రాగ్ డాన్ పోలీసుల కళ్ళు గప్పి నార్సింగి పోలీసు స్టేషన్ నుంచితప్పించుకున్నాడు డ్రగ్స్ కేసులలో నిందితుడిగా ఉన్న ముజఫర్ పరారీ కావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది .
ఈగల్ అధికారులు నెల రోజుల పాటు ముజఫర్‌పై నిఘా పెట్టి మంగళవారం పట్టుకున్నారు. అతనిని విచారించి తదుపరి దర్యాప్తు కోసం ఈగల్ అధికారులు నార్సింగ్ పోలీసు స్టేషన్‌కు అప్పజెప్పారు. గత రాత్రి తనకు కడుపులో నొప్పి వస్తుందని తనను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని చెప్పాడు.
తనకు అర్నియా ఉందని నొప్పిని భరించలేకపోతున్నానని నమ్మించి తాను బాత్ రూమ్ కు వెళ్తానని చెప్పి స్టేషన్‌లోని విజిటర్స్ బాత్ రూంలోకి వెళ్ళాడు. ఆ బాత్ రూంలో వెంటిలేటర్‌కు గ్రిల్ లేకపోవడంతో దాంట్లో నుంచి దూరి బయటికి వచ్చి పోలీసు స్టేషన్ గోడ దూకి పరారైయ్యాడు.రోడ్డు పైకి వచ్చిన ముజఫర్ ఓ క్యాబ్‌ను ఆపాడు. నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టి డబ్బులు, సెల్ ఫోన ను ఎత్తుకుపోయారని తెలిపాడు.
తనను అత్తాపూర్ సమీపంలోని లెనిన్‌నగర్‌లో దించాలని, చెప్పాడు. దీంతో డ్రైవర్ ముజఫర్‌ను లెనిన్‌నగర్‌లో వదిలేశాడు. అంతకు ముందు ముజఫర్ క్యాబ్ డ్రైవర్ ఫోన్‌ను తీసుకుని తన తల్లికి ఫోన్ చేసి అప్రమత్తం చేసినట్లు సమాచారం
/// పోలీసులు అరా //////
డ్రగ్స్ కేసులో నిందితుడు ముజఫర్ నార్సింగి పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకోవడం ఫై ఉన్నతాధికారులు అరా తీస్తున్నారు బాత్ రూంలోని వెంటిలేటర్‌కు గ్రిల్ లేక పోవడం వల్లే ముజఫర్ సులువుగా తప్పించుకున్నాడని స్టేషన్ గోడకు కూడా ఫెన్సింగ్ లేక పోవడం ఇంకా ముజఫర్ కు కల్సి వచ్చినట్లు అయింది
