HomeCRIMEరోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, సమాజంలో చైతన్యం తీసుకురావాలని నిజామాబాద్...

రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, సమాజంలో చైతన్యం తీసుకురావాలని నిజామాబాద్ రెండో టౌన్ ఎస్ఐ యాదగిరి గౌడ్ పిలుపునిచ్చారు.

బుధవారం స్థానిక షాహీన్ కళాశాలలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా ప్రభావితమవుతున్న డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో చాటింగ్, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే, రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, వాహనం నడిపేటప్పుడు నిబంధనలు అతిక్రమించవద్దని సూచించారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ భద్రతను దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments