HomeEditorial Specialనేతలకు ముంచుకొస్తున్న పదవి ముప్పు ……..మరో చాన్స్ కోసం ప్రయాసాలు …..పూర్తీ కానున్న కార్పొరేషన్ ఛైర్మెన్...

నేతలకు ముంచుకొస్తున్న పదవి ముప్పు ……..మరో చాన్స్ కోసం ప్రయాసాలు …..పూర్తీ కానున్న కార్పొరేషన్ ఛైర్మెన్ ల పదవి కాలం ……..

అధికార పార్టీ నేతలకు పదవి గండం ముంచుకొస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చాక అందలం ఎక్కిన నేతలకు ఇప్పడు ఆ కుర్చీ దిగే సమయం ఆసన్నం అయింది. అయ్యే అప్పుడే అందలం దూరం అవుతుందా అనే బెంగ నేతల్లో మొదలయింది.

మరోసారి అవకాశం ఇవ్వాలని శత ప్రయత్నాలు చేస్తున్నారు. మరోదఫా పదవి కాలం పొడగించాలంటూ అగ్ర నేతలను ప్రాధేయ పడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన మొదట్లో ముఖ్య నేతలు కార్పొరేషన్ ఛైర్మెన్ లుగా నియామకం అయ్యారు.

వారి పదవి కాలం రెండేళ్లు పూర్తీ కావొస్తుంది ఈ నెలఖారు లోగ చాల మంది చైర్మన్ ల పదవి కాలం పూర్తీ కాబోతుంది. వీరిలో కొంత మంది కీలక నేతలకు పదవి కాలం పొడిగించే ఛాన్స్ వుందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

ఒకరిద్దరికి నేరుగా సీఎం రేవంత్ నుంచి స్పష్టమైన హామీ ఉన్నట్లు గా చెప్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లా నుంచి అరడజన్ మందికి కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులు దక్కాయి.అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో నామ మంత్రంగా ఫలితాలు వచ్చినా సరే పదవుల పందేరం లో జిల్లాకు ప్రాధాన్యత దక్కింది.

ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లకోసం చివరి దాక పట్టుబట్టి అధిష్టానం బుజ్జగింపు లతో వెనక్కి తగ్గిన నేతలకు మొదటి ప్రాధాన్యత గా భావించి కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులు కట్టబెట్టింది.ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షులుగా ఉన్న మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మెన్ గా నియామకం అయ్యారు మాజీ డీసీసీ తాహెర్ ఉర్దు అకాడమీ ఛైర్మెన్ గా నియామకం అయ్యారు.

మాజీ ఎమ్మెల్యే అనిల్ ఇరవత్రి మినరల్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ గా నియామకం అయ్యారు.కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న అన్వేష్ రెడ్డి విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మెన్ గా ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మెన్ గా బాలరాజు లు నియామకం అయ్యారు.ఏకంగా ఐదు కార్పొరేషన్ ఛైర్మెన్ లు జిల్లాకు దక్కడం పార్టీ వర్గాలను ఉత్తేజం కలిగించింది.

వీరంతా రేవంత్ పీసీసీ చీఫ్ గా పనిచేసే టైం లో పార్టీకోసం ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి ఆయన వద్ద మంచి మార్క్ లు వేసుకున్నవారే. అందుకే పదవులు దక్కాయి పార్టీలోకి కొత్తగా వచ్చినముఖ్య నేతలను సైతం కాదని వీరందరికి పదవులు కట్టబెట్టారు.

కార్పొరేషన్ ఛైర్మెన్ లుగా రెండేళ్ల పదవి కాలం పూర్తీ కాబోతుంది. మరోసారి వీరికి పదవులు దక్కుతాయా లేదా అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.ఒకరిద్దరికి మినహా ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచనగా ఉంది.

ముఖ్యంగా రెండేళ్ల పదవి కాలం లో పార్టీ ప్రభుత్వ వ్యవహారాలు వదిలేసి అవినీతి అక్రమాలకు తెరలేపిన వారికి ఛైర్మెన్ లుగా కొనసాగించే ఛాన్స్ లేదని సమాచారం.

అదీగాక మరోదఫా కొనసాగిస్తే సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం వుందని పార్టీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మండవ వెంకటేశ్వర్ రావు ,అరికెల నర్సా రెడ్డి, ఆకుల లలిత ,ధర్మపురి సంజయ్ డి రాజేశ్వర్ లాంటి నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి పార్టీ అగ్ర నేతలు ఇప్పటికే హామీ ఇచ్చారు

ఈ నేపథ్యంలో వీరికి సర్దుబాటు చేస్తారా లేదంటే ఉన్నవారిని మరోదఫా కొనసాగిస్తారా అనేది అధికార పార్టీ లో హాట్ టాపిక్ గా ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments