రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘట్ కేసర్ లో జరిగింది మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట చెందిన రవికుమార్, శిరీష లు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో నివాసముంటున్నారు.
గురువారం రాత్రి ఘట్‌కేసర్ నుంచి బీబీనగర్ వైపు వెళ్లే రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్‌సీ సమీపంలో రైలు కిందపడి రవికుమార్, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మ హత్య కు పాల్పడి వుంటారని చెప్తున్నారు
