కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్ కాలనీ లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన రెండు డీటీసీపీ వెంచర్లను అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్ కాలనీలో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రెండు అక్రమ డీటీసీపీ వెంచర్లను మున్సిపల్ అధికారులు జేసీబీలతో ధ్వంసం చేశారు. 672, 675, 676, 677, 678 సర్వే నంబర్లలో ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా వెంచర్లు అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
గతంలోనే వెంచర్ యజమానులకు నోటీసులు జారీ చేసి, అనుమతులు తీసుకోవాలని సూచించినప్పటికీ స్పందించకపోవడంతో కూల్చివేత చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాలు, అనధికార లే అవుట్లపై ఇలాంటి చర్యలు కొనసాగుతాయని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.
