హెదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధి లోని లంగర్ హౌస్ హోటల్ గ్రాండ్’ లాడ్జ్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది . రేణుక గురువారం రాత్రి ఫారుక్ (34)తో కల్సి హోటల్ కు వచ్చి గది అద్దెకు తీసుకున్నారు.ఎదో అవసరం కోసం ఫారుక్ బటయకు వెళ్లి తిరిగి రూమ్‌కు చేరుకున్నాడు.
రేణుక ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఫారుక్ లంగర్‌హౌస్ పోలీసులకు కు సమాచారం ఇచ్చాడు . ఈ మేరకు పోలీసులు వచ్చి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు, అనంతరం క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలను కూడా సేకరించారు.
రేణుకది ఆత్మహత్య కాదని.. హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫారుక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రేణుకది హత్యా.. ఆత్మహత్యా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
