ఈ ఏడాది డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ లు పొందే విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి ఉన్న కాలేజీ లలో చేరాలని హైదారాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కోరారు .కొందరు అనుమతి రాకుండానే విద్యార్ధులను డిగ్రీ కోర్సుల్లో చేర్పించేందుకు ప్రచారాలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
ఇది చట్టరీత్యా నేరం కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుమతి లేకుండా ఎవరు డిగ్రీ కోర్సుల్లో చేర్చుకోవద్దని పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనుమతులు ఉన్న దాంట్లోనే విద్యార్ధులను చేర్చాలన్నారు.
ముఖ్యంగా దోస్త్ లో నమోదయ్యి అందులో ఉన్న కాలేజీలలో చేరాలని సీపీ కోరారు. అంతే కానీ మోసపూరిత ప్రకటనలకు బోల్తా పడి అమూల్యమైన విద్యా సంవత్సరాన్ని కోల్పోవద్దని సీపీ పేర్కొన్నారు.
అనుమతులు లేకుండా విద్యార్ధులను చేర్చుకుంటున్న కాలేజీల సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు.తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారుల నుంచి ఫిర్యాదులు అందాయని ఆయన ప్రస్తావించారు
