HomeCRIMEవర్షాకాలంలో మండల రైతులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తలు పాటించాలి...ఎస్ఐ సుమలత

వర్షాకాలంలో మండల రైతులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తలు పాటించాలి…ఎస్ఐ సుమలత

ఇందల్వాయి మండల కేంద్రంలోని తమ తమ గ్రామాలలో రైతులు,ప్రజలు వర్షాకాలంలో వ్యవసాయ సాగు పొలం వద్ద విద్యుత్ స్తంభాలు, బోరు మోటర్ పంప్ సెట్ లు, స్టార్టర్ బాక్స్,వంటి పరిసర ప్రాంతాలు వర్షపు నీరు విద్యుత్ తీగలు వలన ప్రతి సంవత్సరం ఎన్నో ప్రాణాలు హపోతున్నాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అలాంటి ప్రాంతాల వద్ద వ్యవసాయ రైతులు వ్యవసాయ హకూలీలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సుమలత సూచించారు. అలాగే శిథిలావస్థకు చేరిన పాత గుడిసెలు పెంకుటి ఇండ్లు, వర్షాల కారణంగా కూలిపోయినట్లయితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

పశువుల కొట్టాలు,గొర్రెలు,మేకల గుడిసెలు వంటి ప్రదేశాల వద్ద విద్య స్తంభాల వైర్లు వేలాడి తగలడం వలన ప్రతి సంవత్సరం నష్టం జరుగుతుంటాయనితెలిపారు.అలాంటి ప్రదేశాల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలకు ఎస్ఐ సుమలత తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments