జిల్లాలో పనిచేసే ఎస్పీ లు కమిషనర్ లు క్యాంప్ ఆఫీస్ లకు పరిమితి కావద్దని ఇక నుంచి ఖచ్చితంగా పాలనా కార్యాలయాలకు రావల్సిందే నని డిజిపి ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం జరిగిన వీడియో కాన్ఫిరెన్స్ లోనూ దీనిపై స్పష్టత ఇచ్చారు ఇదో సున్నితమైన హెచ్చరిక గా చెప్పారని సమాచారం.
చాలామంది క్యాంప్ ఆఫీస్ లకే పరిమితం అయి పనిచేస్తునారని ఇక నుంచి ఆలా కుదరని కొత్త బాస్ చెప్తున్న మాట ఎందుకంటే ఎస్పీ లు కమిషనర్ లు ఖచ్చితంగా ప్రతిరోజూ నిర్ణిత సమయాల్లో పోలీసు పాలనా కార్యాలయాలకు వెళ్లాలని అక్కడే ప్రజలను కలసి వారికి సాధక బాధలు తెల్సుకోవాలన్నారు
గతంలో జిల్లాలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండే అందుకే ఎస్పీ లు భద్రత కారణాలతో బయటికి వచ్చేది కాదని కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నక్సల్స్ నుంచి విముక్తి అయినా నేపథ్యంలో జిల్లాలో ఉండే ఎస్పీ లు కమిషనర్ లు క్యాంప్ కార్యాలయాలకు పరిమితం కావద్దని కొత్త బాస్ చెప్తున్నా మాట. తాజా ఆదేశాలతో సోమవారం నుంచి ఆయా జిల్లాలో ఎస్పీ ఆఫీస్ లు కమిషనరేట్ లు సందర్శకులతో కిట కిట లాడనున్నాయి.
