పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి గర్భ గుడి పునర్నిర్మాణ పనులనేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాల ఆలయంలో ఇక నుంచి అమ్మవారి పూజలు జరుగనున్నాయి.
ఈ మేరకు ఆదివారం శాస్రోక్తంగా ఈ కతృవు నిర్వహించారు. శృంగేరి పీఠానికి చెందినవేద పండితులు మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా జరిపారు .
అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి విగ్రహాన్ని బాల ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగింది.ఈ కార్యాన్ని భక్తులు వందలాది వచ్చి తిలకించారు
