మద్నూర్ మండలం లోని సరిహద్దు సలాబత్పూర్ చెక్‌పోస్టు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గ్రామానికి చెందిన ప్రకాశ్(44) చెక్‌పోస్టు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రకాశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
