ఏళ్ళ తరబడిగా ఏ దిక్కు లేక ఆర్థిక చేయూత కోసం ఎదురు చూస్తున్న పేద వృద్దులకు ప్రభుత్వం తీపి కబురు ఇవ్వనుంది. అటకెక్కిన పెన్షన్ దరఖాస్తుల లకు మోక్షం కలిగించబోతుంది.
పెన్షన్ల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకుయంత్రాంగం కసరత్తులు చేస్తుంది. అర్హులైన వారికి కొత్తగా పెన్షన్ లు ఇవ్వడానికి కసరత్తులు జరుగుతున్నాయి.
ఇప్పటికే జిల్లాలో వేలాది పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన తొలి ఏడాదే అర్హులైన వారికి పెన్షన్ లు ఇస్తామని భరోసా ఇచ్చింది ఈ మేరకు దరఖాస్తులు సైతం తీసుకుంది. గ్రామాలు డివిజన్ వార్డుల వారీగా సభ లు పెట్టి మరీ దరఖాస్తులు తీసుకున్నారు.
గత ప్రభుత్వ కూడా ఈ పక్రియ చేపట్టి వెనక్కి తగ్గింది. గత పదేళ్లుగా కొత్తవారికి పెన్షన్ లు మంజూరు చెయ్యడం లేదు. దశాబ్దాల కాలం తర్వాత కొత్త రేషన్ కార్డులను విరి విరిగి ఇచ్చేసిన ప్రభుత్వ ఇప్పడు కొత్త పెన్షన్ లను అర్హులైన వారందరికి ఇవ్వడానికి మార్గదర్శకాలు ఖరారు చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ కూడా రావడంతో అర్హులైన వారిని గుర్తించే పనిలో యంత్రాంగం ను పురమాయిస్తుంది తాజా నిర్ణయంతో ఏళ్ల తరబడి పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
త్వరలోనే ఈ అర్హుల తుది జాబితాను విడుదల చేసి, కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లుసమాచారం.రాష్ట్ర మొత్తం లక్షలాది గా కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి అందులో ఇప్పటికే అర్హుల జాబితా ను సిద్ధం చేసారు.
//////అనర్హులను తొలగించే యోచన //////
కొత్తవారికి ఉన్నపలంగా పెన్షన్ లను ఇచ్చేయడం తో పాటు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారిలో అనర్హులను సైతం గుర్తించే పక్రియ ను వేగంగా చెయ్యాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది ఇందులో భాగంగా నే అనర్హులు గుర్తించే కార్యం లో అధికారులున్నారు.
అక్రమంగా నెలవారీగా పెన్షన్లను అందుకుంటున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇందులో కొన్నేళ్ల క్రితమే చనిపోయిన వారి పేరుపై కూడా కొందరు అక్రమార్కులు ఆర్థిక లబ్ది పొందుతున్నారని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
సాంకేతికత ఆధారంగా చేపట్టిన లైఫ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా పెన్షన్ జాబితా నుంచి అనర్హులను తొలగించనున్నారు. చాల మంది చనిపోయిన తర్వాత కూడా వారి పేర్ల మీద పెన్షన్ నగదు డ్రా అవుతుంది.
దీంతో చనిపోయిన, అర్హత లేని వారి పేర్లను పెన్షన్ల జాబితా నుంచి శాశ్వతంగా తొలగించడానికి రంగం సిద్ధం అవుతుంది.అయితే అనర్హులను తొలిగించి వారి స్థానం లోనే కొత్తగా అర్హులైన వారికి ఉన్నపలంగా పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది
