మార్కెట్ కమిటీ నిర్వహణ లోఉండే గాంధీ గంజ్ లో మరోసారి రగడ మొదలైంది. సెక్యూరిటీ సిబ్బంది వ్యాపారుల విషయంలో అనుచిత వైఖరుల మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదివారం యం ఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ డిప్యూటీ మేయర్ ల నేతృత్వం లో గాంధీ గంజ్ లో ఆందోళన కు దిగారు ముఖ్యంగా మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ఫై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ముఖ్యంగా తోపుడు బండ్ల విషయంలో పూటకో మాట చెప్తున్నారు రోజు సెక్యూరిటీ సిబ్బంది వారిని రోజు వేధిస్తున్నారని వారు మండి పడ్డారు.
గతంలోనే పీసీసీ చీఫ్ ను కలిస్తే గంజ్ లో ఏళ్ళ తరబడిగా తోపుడు బండ్ల మీద జీవం సాగిస్తున్న వారికి అండగా ఉంటామని మాట ఇచ్చారని వారు గుర్తు చేసారు వారు నిర్దేశించిన జాగా ల్లోనే బండ్లు నిలిపి వ్యాపారం సాగిస్తుంటే మళ్ళీ ఆ బండ్ల ను మూత్ర శాలల వైపు పెట్టుకోవాలని సతాయిస్తున్నారని వారు మండి పడ్డారు తోపుడు బండ్ల జోలికి వస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు
