జిల్లాల పర్యటనలో భాగంగా డీజీపీ సివి ఆనంద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ స్వాగతం పలికారు.
జిల్లాలో పోలీస్ శాఖ సన్నద్ధత, మౌలిక వసతులు, నేర నియంత్రణ చర్యలు, అంతర్‌శాఖ సమన్వయంపై సమీక్ష నిర్వహించనున్నారు. సోమవారం మణుగూరు పోలీస్ స్టేషన్, పాల్వంచ నూతన డీపీఓ భవనం, ఏఆర్ డీఎస్పీ క్వార్టర్స్, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్, పోలీస్ గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవాలతో పాటు జిల్లా అధికారులతో నేర సమీక్ష సమావేశంలో పాల్గొని అనంతరం ఖమ్మం జిల్లాకు బయలుదేరనున్నారు.
