HomeCRIMEనాంపల్లి కోర్టు లో అగ్నిప్రమాదం..

నాంపల్లి కోర్టు లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు భవనం మూడవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగారు.రెండు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.

దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments