HomeCRIMEచికెన్‌ వ్యర్థాల తరలింపులో మామూళ్ల పేచీ!..ఒకే వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని ఎస్‌ఓటీ వరుస దాడులు..

చికెన్‌ వ్యర్థాల తరలింపులో మామూళ్ల పేచీ!..ఒకే వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని ఎస్‌ఓటీ వరుస దాడులు..

హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో అనేక అక్రమ కార్యకలాపాలు, సమస్యలు కళ్లముందే జరుగుతున్నప్పటికీ.. వాటన్నింటినీ పక్కనపెట్టి కేవలం చికెన్‌ వ్యర్థాల వ్యాపారాన్నే లక్ష్యంగా చేసుకుని స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) పోలీసులు వరుస దాడులు చేయడం, కేసులు నమోదు చేయడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.

చికెన్‌ దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించి డీలర్లకు, సంబంధిత కంపెనీలకు తరలించే వ్యాపారంలో పలువురు ఉన్నారు. ముఖ్యంగా పఠాన్‌చెరువు ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ.. ఎస్‌ఓటీ అధికారుల దాడులు మాత్రం కేవలం ఒకరి చుట్టూనే తిరుగుతుండటం గమనార్హం.

అదే ప్రాంతంలో ఇదే తరహా వ్యాపారం నిర్వహిస్తున్న మరో వ్యక్తి ఉన్నప్పటికీ, అతని జోలికి అస్సలు వెళ్లకుండా ఒకే వ్యాపారిపై పదేపదే దాడులు చేయడం వెనుక అసలు కారణాలేమిటనే దానిపై తీవ్ర చర్చ మొదలైంది. ఒకే వ్యక్తిపై వరుస దాడులు జరగడం పక్షపాత వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోంది.

నగరంలో అనేక రకాల నేరాలు, అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నా.. వాటిని పక్కనపెట్టి ఎస్‌ఓటీ పోలీసులు కేవలం ఈ చికెన్‌ వ్యర్థాల వ్యాపారంపైనే పదేపదే ఎందుకు వేలాడుతున్నారో అర్థం కాక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కడ జరిగినా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందే.

అయితే, ఒకే రకమైన వ్యాపారం చేస్తున్న వారిలో ఒక్కరిపైనే పదేపదే దాడులు నిర్వహిస్తూ, అదే ప్రాంతంలోని మరో వ్యాపారిని పట్టించుకోకపోవడం అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఇంత జరుగుతున్నా, ఎస్‌ఓటీకి చెందిన ఇద్దరు అధికారులు కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, స్థానిక పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయిస్తూ ఆ వ్యాపారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

అసలు నగరంలో ఎన్నో రకాల అక్రమాలు, దందాలు సాగుతుంటే.. వాటి జోలికి వెళ్లకుండా కేవలం ఈ వ్యాపారాన్నే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments