నేషనల్ పోలీస్ అకాడమీలో శనివారం నిర్వహించిన 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్కు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని పరేడ్ను సమీక్షించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.హైదరాబాద్లో నేషనల్ పోలీస్ అకాడమీ ఉండటం వల్ల తెలంగాణ పోలీసు శాఖకు, అకాడమీకి మధ్య చాలాకాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని విధి నిర్వహణలోకి అడుగుపెడుతున్న ప్రొబేషనరీ అధికారులకు పాసింగ్ అవుట్ పరేడ్ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని తెలిపారు. సుమారు రెండు గంటలపాటు జరిగే ఈ వేడుక వారి పోలీసు ప్రస్థానంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి ముందు అల్పాహార సమయంలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ అధికారులతో పాటు విధుల్లో ఉన్న, పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులను సీవీ ఆనంద్ కలిశారు. ఈ సందర్భంగా వారితో పరస్పరం మాట్లాడారు.
