HomeDevotionalబాసర అమ్మవారి ఆలయం లో కూల్చివేత లు

బాసర అమ్మవారి ఆలయం లో కూల్చివేత లు

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం నుంచి భారీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఆలయ పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా..అధికారులు ప్రోక్లైన్ల సాయంతో ఆలయ పాత రాజగోపురాన్ని కూల్చివేస్తున్నారు

గర్భాలయానికి ఇరువైపులా ఉన్న మండపాలు, వంటశాల,  ఇతర పాత కట్టడాలు శిథిలావస్థకుచేరిన నిర్మాణాలను తొలగిస్తున్నారు . ఆగమ శాస్త్ర నియమాలను, పూజారుల సూచనలను పాటిస్తూ ఈ కూల్చివేతలు ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయి.

కూల్చివేతలు , నిర్మాణ పనులు నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments