HomeCRIMEనగరంలో ముమ్మరంగా కార్డెన్ సెర్చ్!

నగరంలో ముమ్మరంగా కార్డెన్ సెర్చ్!

నగరంలో శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు, అసాంఘిక శక్తుల కదలికలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ముమ్మరంగా ‘కార్డెన్ సెర్చ్’ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు 5వ టౌన్ పరిధిలో ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో నిర్వహించారు.

నాగారంలోని 50, 80 క్వార్టర్స్ ప్రాంతాల్లోని ప్రతి సందును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు గుర్తించి, 55 ద్విచక్ర వాహనాలు,13 ఆటోలు, 1 టాటా ఏస్ వాహనంను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, “ప్రజల భద్రతే మా బాధ్యత. నేర రహిత సమాజం కోసం చేపట్టిన ఈ కార్డెన్ సెర్చ్‌లకు ప్రజలు సహకరించాలి.

కాలనీల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. వాహనదారులు నిబంధనలను పాటించి, అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments