జక్రాన్పల్లి మండలం కొల్పాక గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ‘చీతా ఫోర్స్’ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే… కొల్పాక గ్రామంలో కొందరు వ్యక్తులు రహస్యంగా పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు, ఏసీపీ శ్రీశైలం పర్యవేక్షణలో చీతా ఫోర్స్ బృందం సోదాలు నిర్వహించింది.
ఈ మెరుపుదాడిలో పేకాటకు పాల్పడుతున్న 40 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 1,33,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
పట్టుబడిన వారందరిని తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
