HomeDevotionalఈద్గా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి..ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి విన్నవించిన కమిటీ సభ్యులు..

ఈద్గా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి..ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి విన్నవించిన కమిటీ సభ్యులు..

నగరంలోని ధర్మపురి హిల్స్‌లో నిర్మాణంలో ఉన్న అహ్లే హదీస్ ఈద్గా అభివృద్ధికి రూ.18.15 లక్షల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను కమిటీ ప్రతినిధులు కోరారు. శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఈద్గా నిర్మాణం పూర్తయితే ధర్మపురి హిల్స్‌తో పాటు పరిసర ప్రాంతాల ముస్లిం సోదరులకు ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని వివరించారు. దీనికోసం ప్రభుత్వం రూ.18.15 లక్షలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించారు. ఈద్గా నిర్మాణానికి అవసరమైన నిధులు వీలైనంత త్వరగా మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన ప్రార్థనా స్థలాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పనులు త్వరగా పూర్తయ్యేలా తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన షబ్బీర్ అలీకి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments