హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా ఉన్న హైడ్రా’ ను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తు మొదట సారి స్థానికులు రోడ్డెక్కారు శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎంఎస్ మక్తా బీఎస్ మక్తా బస్తీలకు చెందిన వేలాది మంది నివాసితులు శుక్రవారం రోడ్డుపైకి వచ్చి భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు.
‘హైడ్రాను రద్దు చేయాలి.. మా బస్తీలను కాపాడాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు.హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డును ఆనుకొని ఉన్న ఈ చారిత్రాత్మక బస్తీలను ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయనే నెపంతో హైడ్రా అధికారులు త్వరలోనే కూల్చివేస్తారనే నేపథ్యంలో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుంతుంది.
దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న తమకు ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను తొలగిస్తే తాము రోడ్డున పడతామని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆగ్రహించిన మహిళలు, స్థానికులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా “సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు
