HomeHEALTHమెరుగైన అత్యవసర సేవలే లక్ష్యం.. ముగిసిన 108 అంబులెన్స్ సిబ్బంది శిక్షణ తరగతులు

మెరుగైన అత్యవసర సేవలే లక్ష్యం.. ముగిసిన 108 అంబులెన్స్ సిబ్బంది శిక్షణ తరగతులు

ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలను అందించేందుకు 108 అంబులెన్స్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ తరగతులు జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగిశాయి.

ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ పి.జనార్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో భాగంగా అత్యవసర వైద్య సేవలు, శిశు సంరక్షణ, సీపీఆర్ , ప్రథమ చికిత్స, ప్రమాద బాధితులకు తక్షణమే అందించాల్సిన వైద్య సాయం తదితర అంశాలపై నిపుణులు సిబ్బందికి ప్రాక్టికల్ డెమోతో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బాధితులకు ప్రాణాపాయం తప్పించేలా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆధునిక వైద్య విధానాలపై పట్టు సాధించి, బాధితులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిక్షణను నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌స్ట్రక్టర్ ప్రమోద్, నిజామాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ స్వరాజ్, కామారెడ్డి జిల్లా కో-ఆర్డినేటర్ తిరుపతి, సిబ్బంది సంతోష్ రెడ్డి, శేఖర్ గౌడ్, లక్ష్మణ్, హఫీజ్, శ్రీనివాస్, కిషన్, విజయ్, అరుణ్, భీంరావ్, రూపేష్, అకేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments