జక్రాన్‌పల్లి మండల పరిధిలోని ఓ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని చీతా ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆకస్మికంగా దాడి నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
వారి వద్ద నుంచి రూ.43 వేల నగదు, తొమ్మిది సెల్ఫోన్లు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో వేల్పూర్ కొత్తపేటకు చెందిన సర్పంచ్ కూడా ఉన్నట్లు సమాచారం. నిందితులను సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
