ముంబయి లో కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స (సర్జరీ) చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు ప్రస్తుతం ఆయన అక్కడ కోలుకుంటున్నారు.
కొద్దిసేపటి క్రితమే ముంబయిలోని ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేరుగా పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లారు.
ఆయనతో దాదాపు అరగంట పాటు మాట్లాడి, సర్జరీ వివరాలను, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. బాబు వెంట పలువురు ముఖ్య నాయకులు కూడా ఉన్నారు.
