నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మాలపల్లి ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మలపల్లి ప్రాంతంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి చెందిన రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని అక్రమంగా నిల్వ ఉంచినట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
దీనిపై అప్రమత్తమైన ఒకటో టౌన్ పోలీసులు, ఆ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక నివాసంలో అక్రమంగా దాచి ఉంచిన సుమారు 58 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
