నిజామాబాద్ పట్టణంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో ఉన్న బేడబుడగజంగం జిల్లా కార్యాలయంలో బేడబుడగజంగం అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బేడబుడగజంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిరిపాటి వేణు మాట్లాడుతూ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలువురు బేడబుడగజంగం కులస్తులు అవగాహన లేకపోవడంతో గతంలో గోసంగి పేరుతో కుల ధ్రువీకరణ పత్రాలు పొందారని తెలిపారు.
అయితే అసలైన గోసంగి కులానికి చెందిన వారు ఉద్యమం చేపట్టడంతో, ఇకపై బేడబుడగజంగం కులానికి చెందిన వారు గోసంగి పేరుతో కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోకుండా తమ అసలు కులమైన బేడబుడగజంగం పేరుతోనే ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు.
గతంలో అవగాహన లేక తీసుకున్న గోసంగి కుల ధ్రువీకరణ పత్రాల స్థానంలో బేడబుడగజంగం కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే జిల్లా స్థాయి పరిశీలన కమిటీ (DLSC) ఏర్పాటు చేసి అర్హులైన వారికి సరైన కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయమై రాష్ట్ర సంఘం తరఫున ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు.అనంతరం బేడబుడగజంగం జిల్లా కమిటీని ప్రకటించారు.
జిల్లా అధ్యక్షుడిగా డొక్క రంజిత్(నిజామాబాద్), జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇప్ప సంగయ్య(డిచిపల్లి), జిల్లా ఉపాధ్యక్షుడిగా మాదనం సీతారాం(ఆర్మూర్),డొక్క శ్యామ్(నిజామాబాద్), సాదుల రాజేశ్వర్(బాల్కొండ), గంధం పెద్ద గంగాధర్ (నందిపేట్), సంకు సాయిలు(ధర్పల్లి) కోశాధికారీగా: గంధం ఆనంద్ (నిజామాబాద్)జాయింట్ సెక్రటరీ: కళ్లెం రాజు (నందిపేట్), విబుది మహేష్ (రుద్రూర్)ప్రచార కార్యదర్శి: చిత్తరి రాజు(బోధన్), డొక్కబాబు (ధర్పల్లి)ఎగ్జిక్యూటివ్ మెంబర్: చిత్తరి రాము (బోధన్),మిరియాల నరేష్ (చందూర్)ప్రధాన సలహాదారు: నిరగొండ బుచ్చన్న(నిజామాబాద్), సలహాదారులుగా :గంధం రాజేష్(బోధన్), ఈర్నాల వెంకటరమణ(నవీపేట్)జిల్లా కోఆర్డినేటర్: సాధుల వీరేశం(ఎడపల్లి)లను నియమించారు. నూతనంగా నియమితులైన నాయకులను రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు అభినందిస్తూ, హక్కుల సాధనకు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నిరగొండ బుచ్చన్న, బేడబుడగజంగం జనసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంధం రాజేష్, కామారెడ్డి జిల్లా నాయకులు సంకు పోచయ్య, మధనం సీతారాం తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే ఉమ నిజామాబాద్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది బేడబుడగజంగం కులస్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
