కోట్ల రూపాయల ప్రజాధనంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన నిజామాబాద్ ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిలో రోగులు మాత్రం చుక్క నీటి కోసం అల్లాడుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రి… ఇప్పుడు తాగునీరు, బాత్రూం నీటి కోసం రోగులను అవస్థల పాలుచేస్తోంది.
ప్రసూతులు, బాలింతలు, నవజాత శిశువులు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలు కనీస నీటి సౌకర్యం లేక నరకయాతన అనుభవిస్తున్నాయి. టాయిలెట్‌కు వెళ్లాలంటే సొంతంగా వాటర్ బాటిల్ కొనుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనడం ప్రభుత్వ వైద్య వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోంది.
పాత మాతాశిశు ఆస్పత్రి నుంచి ఎంతో ఆశతో కొత్త భవనానికి తరలివచ్చిన ప్రజలకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. తాగేందుకు మంచినీరు లేకపోవడం ఒకవైపు… మరుగుదొడ్లలో నీటి సరఫరా లేకపోవడం మరోవైపు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఇన్‌పేషెంట్ వార్డుల్లో ఉన్న రోగులే బాత్రూంకు వెళ్లాలంటే ముందుగా బయట నుంచి వాటర్ బాటిల్ కొనుగోలు చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రసూతులు శస్త్రచికిత్సల అనంతరం కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం పట్ల వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆస్పత్రిలో చేరిన రోగులతో పాటు వచ్చిన సహాయకులు రోజుకు పలుమార్లు బయటకు వెళ్లి నీటి బాటిళ్లు కొనుక్కొని వస్తున్నారు. కొందరు రోగుల బంధువులు సమీప దుకాణాల నుంచి నీరు తెచ్చి తాగడం, అదే నీటిని బాత్రూంల కోసం ఉపయోగించడం కనిపిస్తోంది.
ఇది ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితా? అని రోగులు ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయలతో భవనం నిర్మించి ప్రచారం చేసుకోవడం తప్ప, కనీస మౌలిక సదుపాయాల నిర్వహణను పూర్తిగా విస్మరించారని ప్రజలు మండిపడుతున్నారు.
ఆస్పత్రిలో నీటి సమస్య గురించి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగుల ప్రాణాలకు సంబంధించిన అంశంలోనూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని ఆరోపిస్తున్నారు.
ప్రసూతులు, నవజాత శిశువులు అత్యధికంగా చికిత్స పొందే ఈ ఆస్పత్రిలో నీటి కొరత కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. పరిశుభ్రత అత్యంత అవసరమైన వైద్యశాలలోనే నీరు లేకపోతే ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి తాగునీరు, బాత్రూం నీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని రోగులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దేప్రసూతులు, చిన్నారులు, సహాయకుల అవస్థలుకోట్లతో భవనం… కనీస వసతుల్లో ఘోర వైఫల్యంకోట్ల రూపాయల ప్రజాధనంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన నిజామాబాద్ ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిలో రోగులు మాత్రం చుక్క
నీటి కోసం అల్లాడుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రి… ఇప్పుడు తాగునీరు, బాత్రూం నీటి కోసం రోగులను అవస్థల పాలుచేస్తోంది. ప్రసూతులు, బాలింతలు, నవజాత శిశువులు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలు కనీస నీటి సౌకర్యం లేక నరకయాతన అనుభవిస్తున్నాయి.
టాయిలెట్‌కు వెళ్లాలంటే సొంతంగా వాటర్ బాటిల్ కొనుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనడం ప్రభుత్వ వైద్య వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోంది. పాత మాతాశిశు ఆస్పత్రి నుంచి ఎంతో ఆశతో కొత్త భవనానికి తరలివచ్చిన ప్రజలకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి.
తాగేందుకు మంచినీరు లేకపోవడం ఒకవైపు… మరుగుదొడ్లలో నీటి సరఫరా లేకపోవడం మరోవైపు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇన్‌పేషెంట్ వార్డుల్లో ఉన్న రోగులే బాత్రూంకు వెళ్లాలంటే ముందుగా బయట నుంచి వాటర్ బాటిల్ కొనుగోలు చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రసూతులు శస్త్రచికిత్సల అనంతరం కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం పట్ల వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులతో పాటు వచ్చిన సహాయకులు రోజుకు పలుమార్లు బయటకు వెళ్లి నీటి బాటిళ్లు కొనుక్కొని వస్తున్నారు.
కొందరు రోగుల బంధువులు సమీప దుకాణాల నుంచి నీరు తెచ్చి తాగడం, అదే నీటిని బాత్రూంల కోసం ఉపయోగించడం కనిపిస్తోంది. ఇది ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితా? అని రోగులు ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయలతో భవనం నిర్మించి ప్రచారం చేసుకోవడం తప్ప, కనీస మౌలిక సదుపాయాల నిర్వహణను పూర్తిగా విస్మరించారని ప్రజలు మండిపడుతున్నారు.
ఆస్పత్రిలో నీటి సమస్య గురించి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగుల ప్రాణాలకు సంబంధించిన అంశంలోనూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని ఆరోపిస్తున్నారు.
ప్రసూతులు, నవజాత శిశువులు అత్యధికంగా చికిత్స పొందే ఈ ఆస్పత్రిలో నీటి కొరత కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. పరిశుభ్రత అత్యంత అవసరమైన వైద్యశాలలోనే నీరు లేకపోతే ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి తాగునీరు, బాత్రూం నీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని రోగులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
