HomeCRIMEఈ జీరో ఎఫ్ ఐ ఆర్ వ్యవస్థ ఇంకా పూర్తీ స్థాయి లో రావాలి .....వీడియో...

ఈ జీరో ఎఫ్ ఐ ఆర్ వ్యవస్థ ఇంకా పూర్తీ స్థాయి లో రావాలి …..వీడియో కాన్ఫిరెన్స్ లో డిజిపి ఆనంద్

రాష్ట్రంలో ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ వ్యవస్థ అమలు ఇంకా పూర్తిస్థాయిలో జరగాల్సి ఉందని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కమిషనర్ ఎస్పీ లతో పాటు అన్ని యూనిట్ హెడ్ లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు ప్రతి యూనిట్ ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం తెలంగాణ జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో కొంత వెనుకపడ్డామన్నారు. ఇకపై అన్ని విభాగాల్లో రాష్ట్ర పనితీరును మరింత మెరుగుపరచాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.

సైబర్ నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్న డీజీపీ, కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలతో పాటు ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించాలని సూచించారు.

సాంకేతిక ఆధారిత దర్యాప్తు విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ పేర్కొన్నారు. సైబర్ నేరాల దర్యాప్తుతో పాటు సాధారణ పోలీసింగ్‌లో కూడా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ ను పూర్తిస్థాయిలో వినియోగించి దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్, టీ-స్పార్క్ ఎస్పీ రూపేష్, సైబర్ సెక్యూరిటీ ఎస్పీ సాయి శ్రీ లు ఈ కాన్ఫిరెన్స్ లో పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments