నగరంలోని నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయ గుడి వద్ద గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట శిబిరంపై చీతా ఫోర్స్ మెరుపుదాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులోకి వచ్చిన వారిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన న్యాల్ కల్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పేకాట , నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆయన పాత్రపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరంలో పేకాట స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతుంది .
