ఒక్క రోజు సెలవు వచ్చినా సరే సరదా గా వెళ్లి షికార్లు చేయడం ఆనవాయితీ గా మారింది ముఖ్యంగా యువతలో మరీ ఎక్కువైంది. ఇలాంటి సరదాలే ప్రాణాలు తీస్తున్నాయి. సెలవులు వచ్చాయంటే చాలు నలుగురు స్నేహితులు కల్సి షికార్ల కు వెళ్లడం రివాజు గా మారింది.
అందులోనూ నది పరివాహక ప్రాంతాలంటేనే యువత ఆసక్తిగా వెళ్తున్నారు. నది ప్రవాహక ప్రాంతాల్లో రీల్స్ చేసే కల్చర్ మితి మీరుతుంది.
ఆదివారం శ్రీరాం సాగర్ లక్ష్మి కెనాల్ వద్ద నలుగురు యువకులు మృత్యువాత పడిన వైనం యంత్రాంగాన్ని కలవర పెట్టింది ముఖ్యంగా పోలీసు శాఖ అప్రమత్తం అయింది రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులను నివారించడానికి కార్యచరణ సిద్ధం చేస్తుంది.
నది పరివాహక ప్రాంతాల్లో రీల్స్ చెయ్యకుండా కట్టడి చేసే పనిలో పడింది ఆదివారం నలుగురు గల్లంతు అయిన లక్ష్మి కెనాల్ ప్రాంతానికి వచ్చిన సీపీ సాయి చైతన్య ఇదే విషయం ఫై స్పష్టత ఇచ్చారు ఎలాగో వర్షాల కాల సీజన్ కావడంతో జిల్లాలో నిజాంసాగర్ శ్రీరాం సాగర్ లతో ఇతర చిన్న తరహా ప్రాజెక్టు ల వద్ద రీల్స్ చెయ్యకుండా పోలీస్ శాఖ కఠిన ఆంక్షలు అమల్లోకి తేబోతుంది.
సోషియల్ మీడియా లో సందడి చేయాలనే ఆలోచనతో యువకులు ఎక్కువగా నది ప్రవాహక ప్రాంతాలనే ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీరాం సాగర్ లో పూర్తీ స్థాయి నీటి మట్టం లేక పోవడం తో బ్యాక్ వాటర్ ఉండే ప్రాంతాలు మైదానం గా మారాయి అదే రీల్స్ చేసేవారికి టూరిస్ట్ స్పాట్ గా మారింది చాలామంది సోషియల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే యువత ఇదో గోవా అంటూ బ్యాక్ వాటర్ ఏరియా లో రీల్స్ చేస్తూ పోస్టు లు పెడుతున్నారు అవి చూస్తున్న వారు సైతం అక్కడికి వెళ్లి సెల్ఫీ లు దిగుతున్నారు.
కొందరు ఏకంగా బ్యాక్ వాటర్ వైపు ఎలా వెళ్లాలో కూడా రూట్ మ్యాప్ తో సహా వీడియో లు పోస్టు చేస్తున్నారు. ఇదే తరహాలో రీల్స్ చూసి నగరానికి చెందిన ముగ్గరు మెకానిక్ లు మహారాష్ట్ర నుంచి వచ్చిన తమ బంధువు తో కల్సి బ్యాక్ వాటర్ వైపు ఉండే లక్ష్మి కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద మడుగులోకి దిగారు మొదట ఒక్కరే దిగి చిక్కుక పోయినా మిగితా ముగ్గురు రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఆయా ప్రాజెక్ట్ ల్లో నీటి లభ్యత లేదు ప్రతియేటా వర్షాకాల సీజన్ లో ఆయా ప్రాజెక్ట్ లకు సందర్శకులు పోటెత్తుతారు. కాబట్టి యంత్రాంగం రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు తలెత్తకుండా కట్టడి చేయాల్సి ఉంది
